తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. యజమానులు తాళం వేసుకుని ఊరెళ్ళడం పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో దూరి మొత్తం ఊడ్చేస్తున్నారు. దొంగలకి సెలబ్రిటీలు, సాధారణ జనులని తేడా తెలియదు.. వారి కంటికి అందరూ సమానమే. మనుషులు చిన్నోళ్ళా, పెద్దోళ్లా అని చూడరు. కేవలం వస్తువులు చిన్నవా, పెద్దవా అని మాత్రమే చూస్తారు. వారి ఫోకస్ కేవలం విలువైన వస్తువుల మీదనే. అవి ఎవరి ఇంట్లో ఉన్నా ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి అడ్డ కత్తెరలకి.. తెర మీద కనిపించే నటులైనా ఒకటే, తెర మీద నటులల్ని చూసి మురిసిపోయే అభిమానులు, ప్రేక్షకులైనా ఒకటే. ఆ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి ఇంట్లో చోరీ జరిగింది.
కన్నడ పరిశ్రమకు చెందిన వినయ ప్రసాద్.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. 90స్ లో హీరోయిన్ గా నటించిన వినయ ప్రసాద్.. ఆ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు హీరోలకి చెల్లెలిగా, తల్లిగా నటిస్తూ మెప్పించారు. ఇంద్ర, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఆంజనేయులు వంటి అనేక తెలుగు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె బెంగళూరులో నివాసం ఉంటున్నారు.
ಬಹುಭಾಷಾ ಹಿರಿಯ ನಟಿ ವಿನಯ ಪ್ರಸಾದ್ ಮನೆ ದೋಚಿದ ಖದೀಮರು https://t.co/cObmTthUVH#VinayaPrasad #Theft #Police #Crackers #Bengaluru #Kannada #Sandalwood
— PublicTV (@publictvnews) October 30, 2022
దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 22న భర్తతో కలిసి ఉడిపి వెళ్లారట. అక్టోబర్ 26న ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగిందన్న అనుమానంతో వెంటనే వినయ ప్రసాద్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. గదిలో ఉన్న లాకర్ లోంచి నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు వెల్లడించాల్సి ఉంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.