హత్యలు, ఆత్మహత్యలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. ఈ మధ్య కాలంలో భూవివివాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సంగెం మండలం తీగరాజపల్లి గ్రామానికి చెందిన హంస సంపత్(50) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.
ఆయన ఒంటిపై ఉన్న లుంగీని విప్పి అదే లుంగీతో కాళ్లను చెట్టుకు కట్టారు. దీంతో అనంతరం ఘోరాతి ఘోరంగా గొంతులో కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇక ఈ దారుణ ఘటను స్థానికులు చూడటంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ హత్య వెనుక జరిగిన కారణాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఇక దీనికి సబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.