కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే ఓ తల్లి అతడిపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు తల్లి ఎందుకు కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది? అసలేం జరిగిందంటే?
కొడుకు ఎలాంటి తప్పు చేసినా.. తల్లి ప్రేమతో తన కొడుకును దగ్గరకు తీసుకుంటుంది. అయితే కొడుకు చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తే.. ఏ తల్లికైనా కోపం వస్తుంది. అచ్చం ఇలాగే కొడుకు ప్రవర్తనపై విసుగు చెందిన ఓ తల్లి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొడుకుపై ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది గుజరాత్ నదియాద్ పరిధిలోని దేగమ్ పటేల్ ఫాలియా ప్రాంతం. ఇక్కడే 34 ఏళ్ల ఆనంద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడి తండ్రి ఇటీవల కాలంలోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ కొడుకు తన తల్లిని చూసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆనంద్ తల్లి ఏదో పని మీద బయటకు వెళ్లాలనుకుంది. ఇందు కోసం తల్లి.. ఆనంద్ ను బయటకు వెళ్లాలని, బైక్ తీసుకురావాలని కొడుకుని కోరింది. దీంతో తల్లీ కొడుకులు ఇద్దరూ బైక్ పై బయలుదేరారు. అయితే కొద్ది దూరం వెళ్లాక.. కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్లాడు.
ఇక కొద్ది దూరం వెళ్లాక కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపు తప్పి తల్లీకొడుకు ఇద్దరూ కిందపడ్డారు. దీంతో తల్లికి గాయాలయ్యాయి. అనంతరం కొడుకు ఆనంద్.. తల్లిని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇక అటు నుంచి తల్లీ కొడుకులు ఇంటికి వెళ్లే క్రమంలో.. తల్లి ఇంటికి వెళ్లకుండా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నా కొడుకుకు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని ఎన్నో సార్లు మందలించాను. అయినా సరే.. వాడి ప్రవర్తన మారకపోవడంతో పాటు తాజాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. కిందపడేశాడు.
దీంతో నాకు తీవ్ర గాయాలయ్యాయి. అందుకు నా కొడుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానంటూ ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొడుకు ర్యాష్ డ్రైవింగ్ పై పోలీసులకు ఫిర్యాదు తల్లి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.