గత నాలుగు నుంచి మహారాష్ట్రలో ‘కొడవలి గ్యాంగ్’ హల్చల్ చేస్తుంది. పూణే పరిసర ప్రాంతాల్లో దోపిడికి పాల్పడుతూ ప్రజలను భయందోళలనకు గురి చేస్తోంది. అసలేంటీ ‘కొడవలి గ్యాంగ్.
‘కొడవలి గ్యాంగ్’.. ఇదే ముఠా ఇప్పుడు మహారాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అవును మీరు విన్నది నిజమే. ముసుగులు ధరిస్తారు. అనుమానం రాకుండా షాపుల్లోకి వెళ్తారు. ఇక ఆ షాపులో ఉన్న వ్యక్తులను కొడవళ్లతో బెదిరించి ఉన్నకాడికి దోచుకెళ్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఈ ముఠా నాలుగు నెలల్లోనే ఏకంగా 100కుపైగా దోపిడి ఘటనలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల మహారాష్ట్రలోని ఓ మెడికాల్ షాపులోకి వెళ్లి కొడవలితో షాపులో ఉన్న వ్యక్తులను బెదిరించారు. అంతేకాకుండ వారిపై దాడులు కూడా చెయబోయారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఎవరీ ‘కొడవలి గ్యాంగ్’ ముఠా సభ్యులు. మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది?
మహారాష్ట్రలో కొంతమంది యువకులు ఓ గ్యాంగ్ గా ఏర్పడి కొడవళ్లతో బెదిరిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి వరుస దొంగతనాలు, వ్యక్తులపై దాడులు, డబ్బులు ఇవ్వకపోతే హింసించడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా వీరి దొంగతనాల్లో భాగంగా కొడవలి చేత బట్టి దోపడికి పాల్పడుతున్నారు. అందుకే ఈ సభ్యులు కోయతా (కొడవలి) గ్యాంగ్ ముఠాగా పిలుస్తున్నారు. అయితే ఇటీవల పూణే పరిధిలోని పంప్రి చించ్వాడ నగరంలో ముగ్గురు యువకులు మాస్కులు ధరించి ఓ మెడికల్ లోకి వెళ్లి ఆ నిర్వాహకులపై దాడికి యత్నించారు. వారిని కొడవళ్లతో బెదిరించి షాపులో ఉన్న రూ.4000 నగదు దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ ఆ మెడికల్ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అనంతరం ఆ షాపు నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ షాపులో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా మోహిత్, అనికేత్, సాయినాథ్, సుబోధ్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కొడవలి గ్యాంగ్ ముఠాలో ప్రేమ్ ప్రకాశ్ డోంగ్రే (18), మోహిత్ సింగ్ (19), సుబోధ్ గైక్వాడ్ (18), కిరణ్ ప్రకాశ్ (19), అనికేత్ హతమ్‌కర్ (19), అవి నింబాల్కర్ (19), రాహుల్ అనే యువకులు సభ్యులుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత నాలుగు నెలల నుంచి ఈ గ్యాంగ్ 100కు పైగా దోపిడి ఘటనలకు పాల్పడ్డారని తెలిపారు. ఇక వరుస కొడవలి గ్యాంగ్ ముఠా దోపిడి ఘటనలతో స్థానిక ప్రజలను హడలిపోతున్నారు. ‘కొడవలి గ్యాంగ్’ వరుస ఘటనలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు కూడా జారి చేశారు. మహారాష్ట్రలో రెచ్చిపోతున్న ‘కొడవలి గ్యాంగ్’ దోపడి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
पिंपरीत कोयटा टोळीची दहशत. मेडिकल स्टोअरच्या मालकावर हल्ला करून दुकानाची तोडफोड कशी केली हे आपण पाहू शकतो. शुक्रवार आणि शनिवारी मध्यरात्री ते परिसरातील अनेक वाहनांची तोडफोड करतानाही दिसले. ही संपूर्ण घटना सीसीटीव्हीत कैद झाली आहे. pic.twitter.com/hSC3caHh6X
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) April 29, 2023