అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు అక్రమ సంబంధాల పెట్టుకుని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇలా ఎవరికివారు చేడు దారుల్లోకి వెళ్తూ పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టస్తోంది. వివరాల్లోకి వెళ్తే..పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ముజఫర్గఢ్ చెందిన అక్రమ్ అనే వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఇక చివరికి అది బయటికి పొక్కి మహిళ భర్త ఖయూమ్ వరకు వెళ్ళింది. నన్ను కాదని వేరే మగాడితో ఇలా చేసిందని అతను తట్టుకోలేక పోయాడు. ఇక తన భార్యతో అక్రమ సంబంధానికి ఒడిగట్టిన వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలనుకుని పథకం రచించాడు. పదిమందిలో తిరిగే ఖయూమ్ సూటిపోటి మాటలకు తట్టుకోలేక పోయాడు. దీంతో ఆగ్రహం తో ఊగిపోయిన ఆయన ఎట్టకేలకు అక్రమ్ ని పట్టుకోవాలనుకున్నాడు.
అతను అనుకున్నట్లుగానే కాపు కాసి పట్టుకునేందుకు ప్రయత్నం చేసిన ఖయూమ్ అక్రమ్ ని పట్టుకున్నాడు. ఇక కోపంతో ఉగిపోయిన ఖయూమ్ కత్తితో అక్రమ్ ముక్కు, చెవులు రెండు కోసేశాడు. పథకం ప్రకారమే అతనిపై దాడి జరిపి అక్కడి నుండి పరారయ్యాడు. ఇక అక్రమ్ తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడు. దీంతో గమనించిన స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.