కొందరు తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుని అందరి మెప్పును పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా పెళ్లి తంతులో భాగంగా చాలా మంది వరుడిని ఊరేగింపుగా తీసుకెళ్తూ డీజే సాంగ్స్ భరాత్ తీస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వరుడిని ఒక్కొక్కరు ఒకోలా ఊరేగింపుగా తీసుకెళ్తూ ప్రత్యేకతను చాటుతుంటారు. కొందరు గుర్రంపై తీసుకెళ్తే, మరి కొందరు కారులో లేదా మరేదైన వాహనాల్లో తీసుకెళ్తుంటారు. ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసిన ఓ వరుడు ఏకంగా బుల్డోజర్ పై వచ్చాడు.
చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తాజాగా మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బేతుల్ జిల్లా కెర్పానీ గ్రామంలో ఈ నెల 21న వివాహమైంది. అయితే పెళ్లి తంతులో భాగంగా బంధువులంతా వరుడిని ఊరేగింపు తీయాలని అనుకున్నారు. కానీ అందరిలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: పెళ్లికొడుకు చెంప పగలకొట్టిన మరదలు.. అసలు ఏం జరిగిందంటే!
ఏకంగా బుల్డోజర్ ను అందంగా ముస్తాబు చేసి అందులో వరుడిని కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చారు. దీనిని కొందరు వీడియోలు తీసి ఎంచక్కా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది మెల్ల మెల్లగా పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు బుల్డోజర్ నడిపిన డ్రైవర్ కు రూ.5 వేల జరిమానా విధించారు. ఇక ఇంతటితో ఆగకుండా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.