వాళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం. గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు వేరుకావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలం పాటు ఈ కొత్త దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో అమ్మాయి తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడులోని వేలూరు జిల్లా పేరణంపట్టంలోని వీకే నగర్. ఇదే గ్రామంలో రాజేశ్వరి, రోజా అనే యువతి యువకుడు నివాసం ఉంటున్నారు. ఒకే ఊరు కావడంతో ఇద్దరికి కాస్త పరిచయం ఉంది. ఈ పరిచయమే రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఇక ఇద్దరూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ప్రేమికులు.. చివరికి స్నేహితుల సమక్షంలో గుడిలో వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కొంత కొన్ని రోజుల పాటు వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది.
కానీ పెళ్లైన మూడు నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఏదో విషయమై బెడ్ రూంలో రోజూ గొడవకు దిగేవారు. రాజేశ్వరి భర్తతో గొడవ పడడం, పుట్టింటికి వెళ్లి మూడు రోజుల తర్వాత మళ్లీ భర్త వద్దకు రావడం జరిగేది. గత నెల రోజులుగా ఇదే సాగుతూ వచ్చింది. అయితే అచ్చం ఇలాగే ఇటీవల ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. కోపంతో భర్త రాజు భార్య రాజేశ్వరిపై దాడి చేశాడు. కోపంతో ఏడ్చుకుంటూ రాజేశ్వరి బయటకు వెళ్లింది. గంట అయినా భార్య ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరిగిందంటూ రాజు తన అత్తింటివాళ్లకు ఫోన్ చేశాడు. మా ఇంటకి రాలేదని అత్తమామలు చెప్పారు. దీంతో రాజా భార్య రాజేశ్వరి జాడ కోసం అంతటా వెతికాడు.
ఎంత వెతికినా రాజేశ్వరి ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో భర్త రాజా.. నా భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. వీరి గ్రామ సమీపంలోని ఓ బోరు బావిలో రాజేశ్వరి శవమై తేలింది. అనంతరం రాజేశ్వరి మృతదేహాన్నిపోలీసుల పరిశీలించగా.. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే పోలీసులు భర్త రాజాను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగ మారింది.