మరికొద్దిసేపట్లో వివాహం.. పెళ్లి మండపంలోకి బంధువులంతా వచ్చారు. డప్పు వాయిద్యాలతో అల్లరి అల్లరిగా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ముహూర్తం కుదిర్చిన సమయానికి పెళ్లి చేసేందుకు అంతా రెడీగా ఉన్నారు. ఇక పెళ్లి కూతురు కూడా పెళ్లి పీటలెక్కింది.. కట్ చేస్తే గంట తర్వాత వరుడు ఇంటి ముందు పెళ్లి కూతురు ధర్నాకు దిగింది. ఈ షాకింగ్ ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలు ఇంతకు ఏం జరిగింది?. పెళ్లి కూతురు వరుడు ఇంటి ముందు ధర్నా చేయటానికి కారణమేంటనేదే కాదా మీ ప్రశ్న?.
ఇక విషయం ఏంటంటే..? ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ ప్రాంతానికి చెందిన వధువు డింపుల్ డాష్, అదే పట్టణానికి చెందిన వరుడు సుమీత్ సాహులు కొంతకాలం క్రితం రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కొంత కాలం తర్వాత ఇరువురు కుటుంబాల నిర్ణయం మేరకు అందరి సమక్షంలో మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే పెళ్లి ఏర్పాటు కూడా ఘనంగా చేశారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఇక బంధువులంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు.
డప్పు వాయిద్యాలతో అంతా అల్లరి అల్లరిగా పెళ్లికి అంతా సిద్దంగా ఉంది. పెళ్లి కూతురు కూడా పెళ్లి పీటలెక్కింది. ఇక వరుడు రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎంత సేపు చూసినా వరుడు మండపానికి రాలేదు. గంటల తరబడి చూశారు. ఇక ఎంతకు కూడా వరుడు రాకపోవడంతో ఫోన్ చేశారు. అయిన స్పందించకపోవడంతో వధువు తరుఫు బంధువులు వరుడు ఇంటి ముందు పెళ్లి కూతురుతో ధర్నాకు దిగుతూ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లైన నాటి నుంచి అత్తింటి వాళ్లు చిత్ర వధకు గురి చేస్తూ లైంగికంగా వేధించారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక వధువు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.