కేరళ రాష్ట్రంలోని సింధు అనే 44 ఏళ్ల వివాహిత భర్తతో పాటు 12 ఏళ్ల కుమారుడితో నివాసం ఉంటోంది. కొన్నాళ్లు బాగానే ఉన్నా భర్తతో గొడవలు రావటంతో సింధు వేరే కుంపటి పెట్టుకుంది. దీంతో కొంత కాలం కుమారుడితో పాటు ఉంటున్న సింధుకి పక్కింట్లో ఉండే బెనాయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధంగా రూపు మార్చుకుంది. దీంతో భర్త లేకపోవటంతో బెనాయ్ వద్ద ఉండాలని భావించిన సింధు ముల్లెమూట సర్దుకుని బెనాయ్ ఇంటికి చేరుకుని అక్కడే ఉంటుంది.
దీంతో కొన్నాళ్లకు తన మొదటి భర్త అనారోగ్యంగా ఉన్నాడని తెలియటంతో చూసి వస్తానని బెనాయ్ కి తెలిపింది. దీనికి అంగీకరించని బెనాయ్ వెళ్లొద్దని తెలిపాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవలు రాజుకున్నాయి. నువ్వు వెళ్తే.. గనుక నీ కుమారుడి చంపేస్తానంటూ బెదిరింపసాగాడు. ఏం చేయాలో తెలియక సింధు తన కుమారుడిని పుట్టింటికి పంపింది. ఇక ఆగస్టు 12 నుంచి సింధు కనిపించకుండా పోయింది. ఈ విషయం సింధు కుమారుడికి తెలియటంతో అమ్మమ్మకు తెలియజేశాడు. ఇక వెంటనే సింధు తల్లి పోలీసులను ఆశ్రయించింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న బెనాయ్ ఇంటి నుంచి జారుకుని దొరకకుండా పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సింధు జాడ కోసం చాలా రోజులు వెతికారు. కానీ ఎక్కడ కూడా తన ఆచూకి దొరకలేదు. ఇక దర్యాప్తులో భాగంగా సెప్టెంబరు 3న చనిపోయిన సింధు మృతదేహాన్ని తన వంటింట్లో నుంచి వెతికి తీశారు పోలీసులు. బెనాయ్ కొట్టి చంపేసి ఎవరికీ తెలియకుండా వంటింట్లోని పోయ్యి కింద గుంత తీసి అందులో పాతి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అదే పోయ్యిపై రెండు మూడు రోజుల పాటు వంట కూడా చేసుకున్నాడని పోలీసులు భావించారు. ఇక వెతిక తీసిన సింధు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సింధు గొంతు పిసికి చంపేసి, వెన్నుముక్కు విరిగేలా కొట్టాడని ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసుల చొరవతో నిందితుడు బెనాయ్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇక బెనాయ్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.