తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగానే ఓ యువకుడు ఎంబీఏ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. త్వరల్లో ఇంటికి వస్తానని, వివాహం చేసుకుంటాని అతడి అమ్మనాన్నలకు చెప్పాడు ఆ యువకుడు. వారి ఆశలు సమాధి చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది తిరిగిరానిలోకాలకు వెళ్లాడు. ఇంకా ఆ తల్లిదండ్రుల వేదన, ఆక్రోదన చెప్పలేనిది.
వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ రాష్ర్టం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటి గూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్(28) డిగ్రీ వరకు నల్గొండలో చదివాడు, ఎంబీఏ అనంతరం ఉన్నత చదువుల కోసం 2018 అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం అమెరికాలో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. దీపాళి రోజున ఇంటికి ఫోన్ చేసి త్వరలో ఇంటికి వస్తానని, అప్పుడే వివాహం కూడా చేసుకుంటానని తల్లిదండ్రుల చెప్పాడు. ఈ నెల 19 సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శేఖర్ మరణించాడు. ఈ విషయం 20న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుమారుడి మరణవార్త విని అతడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహం భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.