Crime News: అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా అదనపు కలెక్టర్‌పైనే దాడి చేశాడు. ఈ సంఘటన తెలంగాణలోని వనపర్తిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రం రాజనగరానికి చెందిన శివకుమార్ సోమవారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినపత్రి ఇవ్వటానికి వెళ్లాడు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. వేణుగోపాల్ సమస్య గురించి అడుగుతుండగానే శివకుమార్ ఆయన చెంపపై కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో కలెక్టర్‌తో పాటు అక్కడివారంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న అటెండర్లు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చీటీ అతడి జోబిలో దొరికిందని తెలిపారు. దీనిపై వేణుగోపాల్ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం స్పందించింది. అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌పై దాడిని ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మరి, అదనపు కలెక్టర్‌పై యువకుడి దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Crime News: ఫేయిల్ చేస్తానని భయపెట్టి, బాలుడిపై ఉపాద్యాయుడి అత్యాచారం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.