telangana crime : సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. భూ తగాదాల నేపథ్యంలో కొందరు ఓ వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. గజ్వేల్ వంశీ అనే వ్యక్తిపై ఒగ్గు తిరుపతి వర్గం కాల్పులు జరిపింది. చెల్లాపూర్‌కు చెందిన ఒగ్గు తిరుపతి, వంశీలకు గత కొన్ని నెలలుగా ఓ స్థలం విషయంలో గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వర్గీయులు వంశీపై కాల్పులు జరిపారు. కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా చందాపూర్ శివారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే, ఈ కాల్పుల్లో వంశీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
చదవండి : గదిలో బాయ్‌ఫ్రెండ్.. బాత్రూంలో బ్యూటిషియన్ శవం.. ఇంతకీ ఏమైంది?..
పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.