అది తమిళనాడులోని ఉత్తర చెన్నై మాధవరం పాలడిపో. ఇదే ప్రాంతంలోని బ్యాంకర్స్ కాలనీలో యువరాజ్, స్నేహ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 నెలల పాప కూడా ఉంది. పుట్టిన కూతురితో దంపతులిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే దేవుడిని దర్శించుకునేందుకు అని మంగళవారం కూతురితో పాటు ఈ దంపతులిద్దరూ సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లారు. ఇక దేవుడిని దర్శనం అనంతరం అక్కడి నుంచి తిరిగి ఇంటికి పయనమమ్యారు.
అయితే ఇంటిక వెళ్లే మార్గమధ్యలోని మాధవారం రౌండ్ ఠానా సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా వెనక నుంచి వచ్చిన లారీ వేగంగా వీరు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూతురితో పాటు దంపతులిద్దరూ చెల్లాచెదురుగా నడిరోడ్డుపై పడ్డారు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు ముందుగా పడిపోయిన పాపను అందుకున్నారు. కాగా భార్య స్నేహను లేపే ప్రయత్నం చేయగా ఎంతకు కూడా స్పందించలేదు.
మరి కొందరు వచ్చి చూడగా స్నేహ మరణించిందనే నిర్ధారణకు వచ్చారు. ఇక చిన్న చిన్న గాయాలతో భర్త, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక భార్య మరణించడంతో భర్త కూతురిని చూస్తూ శోకసంద్రంలో మునిగితేలాడు. కూతురితో పాటు భర్త ఏడుస్తున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటతడిపెడుతున్నారు. ఇటీవల ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.