కూతురి జీవితాన్ని నాశనం చేశాడనే కోపంతో ఓ మహిళ ఒక వ్యక్తిపై దాడికి దిగింది. ఏకంగా కొడవలితో అతడిపై అటాక్ చేసింది.
కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. ఈమధ్య అక్రమ సంబంధాల కేసుల గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. భార్య ఉండగానే మరొకరితో అఫైర్ పెట్టుకున్న భర్త.. భర్త ఉన్నా ఇంకో పురుషుడితో రిలేషన్ నడిపే భార్య లాంటి న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి బంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, అనుమానాలు లాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఇవి శృతి మించి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాల వరకు వెళ్తున్నాయి. ఇలాంటి కేసుల్లో కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా, కేరళలోని కోయంబత్తూరులో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే పెళ్లైన ఒక మహిళ మరో వ్యక్తితో అఫైర్ నడిపిస్తోంది. సదరు వ్యక్తిని ఆ మహిళ తల్లి చితకబాదింది.
కోయంబత్తూరులోని ఒక మహిళ (30)కు ఓ వ్యక్తితో 2017లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వీళ్లిద్దరూ ఎవరికీ భయపడకుండా విచ్చలవిడిగా తిరగసాగారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన మహిళ భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రియుడితో ఆమె తన బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. భార్య తీరులో మార్పు రాకపోవడంతో ఆమెను మళ్లీ మందలించాడు భర్త. దీంతో ఆమె తన పేరెంట్స్ దగ్గరకు వెళ్లిపోయింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా లవర్‌ను కోరిందా మహిళ. దీంతో ఈ విషయంపై మాట్లాడేందుకు కొందరు ఫ్రెండ్స్‌ను తీసుకొని ఆమె పేరెంట్స్ ఇంటికి వచ్చాడా వ్యక్తి. అంతే, కూతురి జీవితాన్ని నాశనం చేశాడనే కోపంతో సదరు మహిళ తల్లి.. ఆ వ్యక్తిపై కొడవలితో దాడికి దిగింది. దీంతో మహిళ రెండో లవర్ తలపై తీవ్ర గాయమైంది. కూతురి ప్రియుడిపై తల్లి దాడి చేసిన ఈ ఘటన గురించి తెలియగానే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఆ మహిళ పేరెంట్స్‌ను అరెస్ట్ చేశారు.