సమాజంలో నేర ప్రవృత్తి అంతకంతుకు పెరుగుతోంది. ప్రభుత్వాల ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా లాభం లేకుండా పోతుంది. ప్రజల్లో జైలు, శిక్షలు అంటే భయం తగ్గడమో లేక.. ఆవేశంలో చేస్తున్నారో తెలియదు కానీ.. నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా బుల్లి తెర నటి ఒకరు భర్తపై హత్యాయత్నం చేసి.. అరెస్ట్ అయ్యింది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో ప్రజల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. శిక్షలు అంటే భయం లేదో.. లేక ఎలాగైనా బయట పడొచ్చు అనే ధీమానో అర్థం కావడం లేదు కానీ.. ప్రతి రోజు నిత్యం ఎక్కడో ఒక చోట నేరాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, అడ్డుగా ఉన్న భర్తనో, భార్యనో వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం.. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడటం వంటి నేరాలు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు చూస్తే.. మరి కొందరిలో మార్పు రావాల్సింది పోయి.. ఈ తరహా సంఘటనలు పెరగడం గమనార్హం. సామాన్యులే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం సంచలనంగా మారింది. తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బుల్లితెర నటి ఒకరు భర్త హత్యకు యత్నించి.. పోలీసులకు చిక్కింది. ఆ వివరాలు..
రమ్య.. సన్ టీవీలో వచ్చిన సుందరి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ క్రమంలో ఆమెని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం.. భర్తపై హత్యాయత్నం చేయడం. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులు క్రితం రమ్య తన భర్త రమేష్‌తో కలిసి బైక్ మీద బయటకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వీరి బండిని ఢీకొట్టాడు. ఆ తర్వాత రమేష్ చేతులు, మెడ, తల మీద బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమ్య, తన స్నేహితుడు చంద్రశేఖరన్‌తో కలిసి భర్తను చంపాలని ప్రయత్నించింది. రమేష్ మద్యం సేవించి.. తనను తిట్టాడని అతడిని చంపాలని చంద్రశేఖరన్‌ని కోరింది. ఈ ప్లాన్‌కు సంబంధించి.. వీరిద్దరూ మొబైల్‌లో మాట్లాడుకున్న మాటలు, మెసేజ్‌లను ఫోన్ రికార్డు ద్వారా సంపాదించారు. రమ్య, చంద్రశేఖరన్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో ప్రొడ్యుస్ చేశారు. ప్రస్తుతం వీరిని కోయంబత్తూరు సెంట్రల్ జైల్‌కు తరలించారు.
ఇక రమ్య, రమేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా దంపతులు మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో రమ్య భర్తను వదిలేసి.. పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెకు చంద్రశేఖరన్‌తో పరిచయం ఏర్పడింది. ఇక రమ్యకు సినిమాల్లో రాణించాలని ఆశ. చంద్రశేఖరన్ దాన్ని ఆసరాగా తీసుకుని.. ఆమెను స్టార్ నటిగా మారుస్తానని హామీ ఇచ్చాడు. దాంతో అతడికి దగ్గరయ్యింది. మరి చంద్రశేఖర్‌తో ఉండాలనే కారణంగానే రమ్య.. భర్తను హత్య చేయాలని భావించిందా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇంకా తెలియలేదు. రమ్య చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.