దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాడు. ప్రజల రక్షణే నా బాధ్యత అనుకున్నాడు. ఇలా ఎన్నో ఏళ్లుగా ఆర్మీ జవాన్ గా ఎనలేని సేవలు అందించాడు. కానీ దేశ రక్షణ కోసం పోరాడి గెలిచిన ఓ ఆర్మీ జవాన్ కట్టుకున్న భార్య ముందు మాత్రం గెలవలేకపోయాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోయిన ఓ ఆర్మీ జవాన్ గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కన్యకుమారి జిల్లా నాగర్ కోయల్ పరిధిలోని సుచింంద్రం గ్రామం. ఇదే గ్రామానికి చెందిన జయప్రకాష్ గతంలో ఆర్మీ జవాన్ గా సేవలు అందించి 2014 లో రిటైర్డ్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి జయ ప్రకాశ్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపే వాహనంలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. కాగా గత కొన్నేళ్ల నుంచి భార్యతో పాటు నివాసం ఉంటున్న జయప్రకాశ్ కు భార్య నుంచి వేధింపులు ఎదురయ్యాయి.
ఇది కూడా చదవండి: Wife: భార్య ఉద్యోగం చేయకూడదని చెయ్యి నరికాడు.. తగ్గేదేలే అంటున్న భార్య!మొదట్లో ఇవన్నీ శర మాములే అనుకున్న జయప్రకాశ్ భార్యకు సర్దిచెబుతూ ముందుకు వెళ్లేవాడు. అయినా భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మరోసారి గొడవలు తలెత్తాయి. ఒకరు నొకరు తిట్టుకోవడంతో ఇద్దరి మధ్య మన్పర్ధలు భగ్గుమన్నాయి. దీంతో జయ ప్రకాశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. బయటకు చెబితే పరువుపోతుందేమోనని తనలో తాను కుమిలిపోయాడు.
ఇక అతని మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే జయ ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే తాజాగా ఇంట్లో గన్ తో తన తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక స్థానికుల ప్రకారం.. భార్య వేధింపుల కారణంగానే జయప్రకాశ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ వాపోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.