Students Crime: శనివారం తమిళనాడులోని మధురైలో చోటుచేసుకున్న ఓ సంఘటన కలియుగానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కొంతమంది బాలికలు బస్టాండ్‌లో తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకే స్కూలుకు చెందిన విద్యార్థినిలు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. గురువారం నుంచి నడుస్తున్న మాటల యుద్ధం.. శనివారం నాటికి ముష్టి యుద్దానికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, మధురైలోని ఓ స్కూలులో చదువుతున్న రెండు గ్రూపుల విద్యార్థినుల మధ్య గత గురువారం నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. శనివారం నాటికి ఆ మాటల యుద్ధం కాస్తా.. చేతల యుద్ధానికి దారి తీసింది. ఈ రెండు గ్రూపుల విద్యార్థినులు పెరియార్ బస్టాండ్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఆడపిల్లలు.. మగవాళ్లకు ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు కొట్టుకున్నారు. పారిపోతున్న వారిని పట్టుకొచ్చి మరీ కొట్టారు. బస్టాండ్‌లో ఉన్న వారందరూ ఈ గొడవను చూసి ఈల వేసి, గోల చేయటంతో రచ్చరచ్చ అయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, తమిళనాడులో వారం రోజుల్లో ఇలాంటి సంఘటనలు మొత్తం మూడు జరిగాయి. చెన్నై బస్టాండ్‌లో కొంతమంది విద్యార్ధినులు కొట్టుకున్నారు. ఆ తర్వాత తిరనల్వేలిలో కూడా కొంతమంది విద్యార్థులు గొడవపడ్డారు. తిరునల్వేలిలో జరిగిన గొడవలో ఓ విద్యార్థి కన్నుమూశాడు. మరి, తమిళనాడులో జరుగుతున్న వరుస విద్యార్థుల గొడవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
என்ன நடக்குது தமிழ்நாட்டுல?? பள்ளிக்கூட மாணவிகள் மதுரை பேருந்து நிலையத்தில்,,,,! நடந்த அடிதடி!
ரவுடிசம் பெருகும் சூழல்!!! pic.twitter.com/TQvSfZSiyk
— மணவை S.செல்வராஜ் AHMA, BA,,, (@Selva_AIADMK) May 1, 2022
ఇవి కూడా చదవండి : Odisha: చిల్లర తో స్కూటీ కొనుగోలు.. నాణేలను లెక్కిస్తూ షోరూం సిబ్బంది కష్టాలు!