ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దంపతులు మధ్యలోనే విడిపోతున్నారు. పెళ్లైన కొంత కాలానికి భార్యాభర్తలు సఖ్యతగా ఉండకపోవడం, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాల కారణంగా చివరికి విడాకులు తీసుకోవడం లేదంటే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త, భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు దిగేవాడు. దీని కారణంగా గొడవలు జరగడంతో భర్త భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది తమిళనాడులో విలుప్పరురం జిల్లా ఆచారకుప్పం గ్రామం. ఇదే గ్రామంలో మత్తువరున్, సంగీత (24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు 5 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలానికి వీరిద్దరి తల్లిదండ్రులు వీరితో కలిపిపోయారు. ఇక ఈ దంపతుల సంసారం కొన్నాళ్ల పాటు బాగానే జరిగింది. కొంతకాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లల కూడా జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఆ భార్యాభర్తల కాపురం బాగానే సాగుతూ వచ్చింది. కానీ పెళ్లైన 3 ఏళ్ల తర్వాత భర్త ముత్తుమరన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. దీంతో భర్త.., భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఇదే కారణంతో భర్త భార్యను తరుచు ఇష్టమొచ్చినట్లు కొడుతు నరకం చూపించాడు.
ఇక ఇదే విషయంపై గత 20 రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త మత్తువరున్.. భార్య సంగీతను ప్రాణాలతో లేకుండా చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ లీక్ చేసి నిప్పు అంటించాడు. దీంతో ఇంట్లో విపరీతమైన మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి తీవ్రంగా గాయపడిన సంగీతను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక తీవ్రంగా గాయపడిన సంగీతకు వైద్యులు చికిత్స అందించారు. అయితే సంగీత ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని భర్త ముత్తువరన్ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఇక విషాదం ఏంటంటే? చికిత్స పొందుతూ సంగీత ఈ నెల 27న ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే భార్య సంగీత మాట్లాడిన ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడు అంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఇక ఆ వీడియోలు చూసిన సంగీత కుటుంబ సభ్యులు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భర్తను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సంగీత హత్యకు కారణమైన భర్తకు కఠిన శిక్ష విధించాలని సంగీత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా అసలు నిజంగా బయటకు రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.