ఆమెకు ప్రియుడంటే ఎంతో ఇష్టం. అతనిపై మనసు పారేసుకోవడంతో ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ యువతి ఇలా అనుకోవడంతోనే అన్ని రకాలుగా అతడికి సహకరించింది. దీంతో ప్రియుడితో కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగింది. కట్ చేస్తే ఉన్నట్టుండి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఇటీవల తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది తమిళనాడు తిరపత్తూరు జిల్లా నడ్రంపల్లి పరిధిలోని కరునానిధి ప్రాంతం. ఇక్కడే శరణ్య (23) అనే యువతి నివాసం ఉంటుంది. అనారోగ్య కారణాలతో శరణ్య తండ్రి గత 10 ఏళ్ల కిందటే మరణించాడు. ఇక అప్పటి నుంచి ఆ యువతి తల్లి వద్దే ఉంటుంది. ఇక ఇంటర్ వరకు చదివిన శరణ్య కొంత కాలం నుంచి ఇంటి వద్దే ఉంటుంది. ఇదిలా ఉంటే తాను చదువుకుంటున్న రోజుల్లో శరణ్యకు పుదుప్ పేటలోని అనుసాగరం గ్రామానికి చెందిన అరుణ్ అనే యువకుడితో పరిచయం పెరిగింది. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి 3 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రియుడు అరుణ్ ప్రియురాలి మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తున్నాయి.
దీంతో గత కొన్ని రోజుల నుంచి అరుణ్ ప్రియురాలు శరణ్యతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. ఇక ప్రియుడు మాట్లాడకపోవడంతో ప్రియురాలు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని శరణ్య.. ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఎలుకలకు పెట్టే విషం తాగుతూ వీడియో తీసుకుంది. అనంతరం అదే వీడియోను ప్రియుడి కుటుంబ సభ్యులకు పంపింది. ఈ విషయం తెలుసుకున్నశరణ్య కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ శరణ్య ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మా