నేటి కాలంలో కొందరు పెళ్లైన వివాహితలు భర్తను కాదని పరాయి వాళ్లతో పరిచయం పెంచుకుంటున్నారు. ఇంతటితో సరిపట్టకుండా ఏకంగా అతనే సర్వస్వం అంటూ వివాహేతర సంబంధాన్ని కొసాగిస్తున్నారు. ఇలా అక్రమ సంబంధాల మైకంలో పడి సొంత భర్తను కాదని ప్రియుడితో వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్యపై భర్త అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేయబోయాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కోయంబత్తూరు పరిధిలోని సౌరిపాళ్యం గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన కుమార్ (26) అనే యువకుడికి 7 సంవత్సరాల క్రితం అనితా (26) అనే యువతితో వివాహం జరిపించారు. ఇక కొన్నాళ్ల తర్వాత వీరికి ఓ కొడుకు, కూతురు జన్మించారు. దీంతో కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫిగానే సాగుతూ వచ్చింది.
ఇది కూడా చదవండి: Nalgonda: పెళ్లి కొడుకు ఓవరాక్షన్.. ఫోజులకు పోయి బాలుడిని చంపేశాడు!అయితే ఈ క్రమంలోనే భార్య పదే పదే పుట్టింటికి వెళ్తూ ఉండేది. దీనిని అనుమానంగా భావించిన భర్త భార్యపై కోపం పెంచుకున్నాడు. దీంతో ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఇక ఎలాగైన భార్యను చంపాలని భర్త పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఇటీవల తన భార్యపై ఓ పదునైన ఆయుధంతో దాడికి ప్రయత్నించాడు.
దీంతో భార్య గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగులు తీస్తూ వచ్చారు. వెంటనే భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.