తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య అనుకుని నిద్రలో ఉన్న పరాయి మహిళపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ వ్యక్తి చేసిన దారుణం ఏంటి? ఈ చర్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఇందిరానగర్ కాలనీ.
ఇదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్, రేణుకాంబాల్ ఇద్దరు భార్యాభర్తలు. దేవేంద్రన్ భార్యా రేణుకాంబాల్ రెండేళ్ల కిందటే మరణించింది. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న దేవేంద్రన్ స్థానికంగా ధనలక్ష్మి అనే మహిళ భర్త మరణించడంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగేది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది విరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి.
ఇది కూడా చదవండి: Jammu & Kashmir: అంత్యక్రియలు చేస్తుండగా చనిపోయిందన్న శిశువులో కదలికలు!దీంతో భార్య ధనలక్ష్మి భర్తను కాదని తన బంధువుల వద్దకు వెళ్లేది. అయితే మరోసారి ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో మనస్థాపానికి గురైన ధనలక్ష్మి అంబూరుకు వెళ్లి అక్కడే రైల్వేస్టేషన్ పరిధిలోని ఓ కంపెనీ పుట్ పాత్ పై నిద్రిస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో ఇటీవల అర్థరాత్రి సమచారం తెలుసుకున్న దేవేంద్రన్ హుటాహుటిన అదే ప్రాంతానికి బయలుదేరారు.
అయితే ఇక్కడే బురక ధరించి ధనలక్ష్మితో పాటు మరో ఇద్దరు మహిళలు నిద్రిస్తున్నారు. దీంతో భార్య అనుకుని దేవేంద్రన్ మరో మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇది గమనించిన స్థానికులు దేవేంద్రన్ కు దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిపాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.