సోమవారం తెల్లవారుజామున ఓ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకంగా తన తుపాకీతో తానే కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
గత కొన్ని రోజుల నుంచి దేశ రక్షణ కోసం సేవ చేసే జవానులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం. ఇటీవల హైదరాబాద్ లో ప్రేమ విఫలమైందని ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో జవాన్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనతో తోటి జవానులు, అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ జవాన్ ఎందుకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
తమిళనాడు నాగపట్నం జిల్లా కేవి కుప్పానికి చెందిన రాజేష్ (28) అనే వ్యక్తి భారత నావిక దళంలో జవాన్ గా పని చేస్తున్నాడు. 2015లో ఇతను భారత నావిక దళంలో ఎంపికయ్యాడు. అప్పటి నుంచి రాజేష్ జవాన్ గా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఇకపోతే.. రాజేష్ ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 12 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. రాత్రంతా బాగానే ఉన్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, సోమవారం తెల్లవారు జామను తుపాకీతో గొంతులో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి జవానులు షాక్ గురయ్యారు.
వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు రాజేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో, నిన్న చెన్నైలో ఇలా.. 3 రోజుల వ్యవధిలోనే జవాన్ లు ఆత్మహత్యలు చేసుకున్న ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.