తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బస్ దిగమన్నందుకు ఓ ప్రయాణికుడు కండక్టర్ ను హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం స్పందిస్తూ మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపాడు. దీంతో ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబేడు బస్టాండ్ నుంచి విల్లుపురానికి శనివారం ఉదయం 4 గంటలకు ఓ బస్ బయలుదేరింది. ముధురాంతకం బస్టాండ్ వద్ద బస్ ఆపడంతో ఓ మద్యం సేవించిన వ్యక్తి బస్ ఎక్కాడు. అయితే బస్ ఎక్కి టికెట్ తీసుకోకుండా కండక్టర్ తో గొడవకు దిగాడు. దీంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. వెంటనే కండక్టర్ ఆ ప్రయాణికుడిని బస్ నుంచి కిందకు దింపాడు. తాగిన మత్తులో ఏం చేయాలో తెలియని ఆ ప్రయాణికుడు వెంటనే కండక్టర్ పై దాడికి దిగాడు.
ఇది కూడా చదవండి: Guntur: వివాహేతర సంబంధం.. ప్రియుడి చేతిలో గ్రామ వాలంటీర్ దారుణ హత్య!
ఈ ఘర్షణలో కిందపడ్డ కండక్టర్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ చివరికి ఆ కండక్టర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాగిన మత్తులో క్షణికావేశంలో ఓ ప్రయాణికుడు చేసిన ఈ పనికి ఓ నిండు ప్రాణం బలైంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.