ఆమెకు ఓ సీరియల్ నటి. పెళ్లై భర్త ఉన్నా.. పరాయి మగాడిపై మనసు పడింది. అలా భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు ప్రియడితో తిరిగేది. అసలు విషయం భర్తకు తెలియడంతో భార్య భర్త హత్యకు ప్లాన్ గీసింది. ఇంతకు ఆ నటి తన భర్తను చంపిందా? అసలేం జరిగిందంటే?
ఆమె ఓ నటి. చిత్ర పరిశ్రమల్లో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. అటు నటనలో ఆరితేరుతూనే ఇటు చీకటి కాపురానికి సైతం తెర తీసింది. అలా సహచర నటుడితో కొన్నాళ్ల పాటు ఈ మహిళ ఎఫైర్ నడిపించింది. ఇక రాను రాను సొంత కాపురాన్ని పక్కకు నెట్టి ప్రియుడికి దగ్గరైంది. చాలా ఏళ్ల పాటు సాగిన ఈ నటి వివాహేతర సంబంధం చివరికి భర్త చెవిన పడింది. ఇక ప్రియుడితో గడిపేందుకు మొగుడు అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు నటి మాస్టర్ ప్లాన్ గీసింది. ప్లాన్ అమలు దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి చివరికి చేతులు కాల్చుకుంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
తమిళనాడు నల్లగౌండన్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే రమేష్, రమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే రమేష్ భార్య రమ్య.. నటనపై ఆసక్తి ఉండడంతో సీరియల్స్ లో నటించేది. అలా చాలా ఏళ్ల పాటు ఆమె సీరియల్స్ లో నటిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే రమ్య సహచర నటుడైన డేనియల్ చంద్రశేఖర్ తో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎంచక్కా రమ్య.. భర్త రమేష్ కళ్లుగప్పి ప్రియుడితో రొమాన్స్ ను కొనసాగిచింది.
అలా కొంత కాలం పాటు రమ్య ప్రియుడితో చీకటి సంసారాన్ని నడిపిస్తూ వచ్చింది. అయితే ఇదే విషయం ఇటీవల భర్త రమేష్ కు తెలిసింది. ఇవేం పిచ్చి పనులు అంటూ భర్త భార్య రమ్యపై కోపంతో ఊగిపోయి మందలించాడు. దీంతో అప్పటి నుంచి ఆమెకు ప్రియుడితో కలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇక అతనిపై మోజుతో ఎలాగైనా రమ్య ప్రియుడితోనే ఉండాలనుకుంది. ఎలా అంటూ అనేక ఆలోచనలు చేసింది. చివరికి రమ్యకు ఓ ఐడియా వచ్చింది. అదే తన భర్త రమేష్ ను ప్రాణాలతో లేకుండ చేయడం. ఇదే విషయాన్ని తన ప్రియుడైన డేనియల్ కు వివరించింది. ప్రియురాలి కోరికను కాదనని ప్రియుడు.. సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీంతో రమ్య, డేనియల్ కలిసి.. రమేష్ హత్యకు మాస్టర్ ప్లాన్ గీశారు. ఇక ఇందులో భాగంగానే ఇటీవల రమేష్ బైక్ పై వెళ్తుండగా డేనియల్ బ్లేడ్ తో రమ్య భర్త గొంతు కోశాడు. ఎలాగో రమేష్ అతడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం రమేష్ ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.ప్రియుడితో ఉండేందుకు రమేష్ భార్య రమ్య భర్త హత్యకు ప్లాన్ గీసిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులైన డేనియల్, రమ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను హత్య చేయాలని చూసిన నటి రమ్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.