ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు రెచ్చిపోయి యువతి ప్రేమకు అంగీకరించలేదని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివవరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లా గంగ వళ్లి పరిధిలోని కుడుమలై గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన మురుగేషన్ కు నందిని(21), రోజా(19) అనే ఇద్దరు కూతుళ్లతో పాటు విజయ్(18) అనే కుమారుడు ఉన్నాడు.
చిన్న కుమార్తె రోజా నర్సింగా పురంలోని కళాశాలలో బీఏ చదువుతోంది. అయితే స్వామిదురై(22) అనే యువకుడు ఇటీవల ఓ రోజు రోజాను చూసిన వెంటనే మనసు పారేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరతో వేధించడం మొదలుపెట్టాడు. ఆమె కలవడం కోసం తరచూ ఆమె చదువుకుంటున్న కళాశాల వద్దకు వెళ్లేవాడు. తన ప్రేమను చెప్పడమే కాకుండా, అంగీకరించకుంటే హతమారుస్తానని ఆ యువతిని బెదిరించాడు. దీంతో ఆందోళన గురైన రోజా ఈ విషయాన్ని సోదరి నందిని ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రోజా తల్లిదండ్రులు పంచాయితి పెట్టించారు. ఇక నుంచి ఆ యువతి వంక చూడొద్దని, ఆమె ఊళ్లోకి రావద్దని, వస్తే పోలీసులకు సమాచారం అందిస్తామంటూ తీర్మానించారు.
ఇదీ చదవండి: ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏళ్లు గడిచినా సంతానం కలగలేదని!దీంతో పంచాయితి పెద్దల ముందు తన పరువు పోవడంతో స్వామిదురై ఉన్మాదిగా మారాడు. దీంతో ఎలాగైన రోజాపై పగ తీర్చుకోవాలని భావించి ఇటీవల నేరుగా రోజా ఇంటికే వెళ్లి వీరంగం సృష్టించాడు. ఇంతటితో ఆగకుండా ఏకంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో స్వామిదురై.. ఆ రోజాను రాళ్లతో కొట్టి తీవ్రంగా దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రోజాను ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్న తల్లికోతి.. వీడియో వైరల్
ఇక చికిత్స పొందుతూ రోజా ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.