ఆమెకు చాలా ఏళ్ల కిందటే పెళ్లైంది. భర్త చెన్నైలోని ఓ హోటల్ లో మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ, అమాయక మొగుడిని చూసి భార్య ఏం చేసిందో తెలుసా?
ఈ రోజుల్లో పెళ్లైన కొంతమంది మహిళలు భర్తతోనే కాపురం చేయకుండా మరో కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని భర్తకు తెలియకుండా సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ రోజులు గడుపుతున్నారు. ఇదేంటని భర్త ప్రశ్నించేసరికి ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తంజావూరు తిరుపనందాల్ పరిధిలోని కిల్మందూర్ పాత వీధి. ఇక్కడే భారతి (37)- దివ్య (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త చెన్నైలోని ఓ హోటల్ లో మాస్టర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. భర్త అమాయకుడు కావడంతో దివ్య చెలరేగిపోయింది. స్థానికంగా ఉన్న డేవిడ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అతను కూడా ఆమెతో సరసాలకు సై అన్నాడు. ఇక ఇంకేముంది.. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు.
అలా వీరి చీకటి కాపురం కొన్నేళ్లుగా సీక్రెట్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే, ప్రియుడిని కలిసేందుకు భర్త అడ్డుగా ఉండడంతో దివ్యకు ఏం చేయాలో తోచలేదు. అనేక ఆలోచనలు చేసింది. చివరికి ఆమెకు ఓ ఐడియా తట్టింది. అదే.. తన భర్త భారతిని ప్రాణాలతో లేకుండా చేయడం. ఇక ఆమె అనుకున్నదే ఆలస్యం.. దివ్య ప్రియుడు డేవిడ్ తో కలిసి భర్త హత్యకు ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే మే 16న భారతి ఇంటికి వచ్చాడు. ఇదే మంచి సమయం అనుకున్న దివ్య.. భర్త హత్యకు పథకం రచించింది.
పక్కా ప్లాన్ తోనే ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత మొగుడి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఓ నదిలో పడేసింది. చాలా రోజులు గడిచినా భారతి కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు భారతి సెల్ ఫోన్ కు ఎవరెవరకు ఫోన్ చేశారు అని దర్యాప్తు చేపట్టారు. ఇక అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలోనే అతని భార్య దివ్యను కూడా విచారించగా అసలు నిజాలు బయటపెట్టింది. నా భర్తను ప్రియుడితో కలిసి నేనే హత్య చేశానంటూ నేరాన్ని అంగీకరిచింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్యను, ఆమె ప్రియుడు డేవిడ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గురాలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.