వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఆ యువతి మాత్రం ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. దీంతో అనేక సార్లు ప్రియుడితో శారీరకంగా కూడా కలుసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల వీళ్లద్దరూ ఓ చోట కలుసుకుని రొమాన్స్ చేస్తుండగా ఇద్దరు యువకులు దొంగచాటున సెల్ ఫోన్ వీడియోలు తీశారు. అనంతరం అదే వీడియోను ఆ లవర్స్ కు చూపించి మేం చెప్పినట్లు చేయకుంటే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ తర్వాత ఆ యువకులు ఆ యువతిని అత్యాచారం చేశారు. కట్ చేస్తే కొన్నిరోజుల తర్వాత ఆ యువతి అసలు నిజాలు తెలిసుకుని షాక్ కు గురైంది.
అది తమిళనాడు విల్లుపురం జిల్లా తిండివనం ప్రాంతం. ఇక్కడే శింబు అనే యువకుడు ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి 10వ తరగతి చదువుకుని స్థానికంగా ఉండే ఓ షాప్ లోకి పనికి వెళ్లేది. అలా వస్తూ పోతూ ఉండే క్రమంలోనే శింబు ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత శింబు ప్రేమిస్తున్నానని వెంటపడి ఆ యువతిని నమ్మించాడు. ఇదంతా నిజమే అనుకున్న ఆ యువతి ఆ యువకుడి మాయలో పడిపోయింది. అలా శింబు కొంత కాలం పాటు ప్రియురాలితో ప్రేమాయణం కొనసాగిస్తూ… ఆ యువతితో శారీరకంగా కూడా కలుసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇటీవల శింబు తన ప్రియురాలితో కలిసి రాత్రిపూట ఓ చోటకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక శింబు ప్రియురాలితో రొమాన్స్ చేశాడు. ఇదే సమయంలోనే ఇద్దరు యువకులు వచ్చి దొంగచాటున వీరి రొమాన్స్ ను వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత ఆ యువకులు అదే వీడియోను ఆ యువతికి చూపించి బ్లాక్ మెయిల్ కు దిగారు. మేం చెప్పినట్లు చేయాలని, లేకుంటే నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో ప్రియుడు కూడా ఏం చేయాలేకపోవడంతో ఆ దుండగులు ఇద్దరు ఆ యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం రెండు రోజుల తర్వాత ఆ యువతి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ప్రియుడి శింబును విచారించారు. పోలీసుల విచారణలో ఆ యువతి ప్రియుడు షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. నా ప్రియురాలిని అత్యాచారం చేసింది ఎవరో కాదని, నా స్నేహితులు అని తెలిపాడు. మేము ఉన్న చోటును ముందుగానే నా ఫ్రెండ్స్ కు వాట్సప్ లోకేషన్ పంపానన్నాడు. ఇక కావాలనే నా ఫ్రెండ్స్ తో నా ప్రియురాలిపై అత్యాచారం చేయించానని ఒప్పుకున్నాడు. ప్రియుడి మాటలు విన్న ప్రియురాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనంతరం పోలీసులు శింబుతో పాటు అతని ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈదారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.