మద్యం మత్తు మనిషిని ఎంతకైన దిగజారేలా చేస్తుంది. కొంత మంది మద్యం మత్తులో వావివరసలు మరిచి బరితెగించి చివరికి ఊహించని పాడు పనులకు శ్రీకారం చుడుతుంటారు. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ అచ్చం ఇలాగే బరితెగించి నడి రోడ్డుపై వీరంగం సృష్టించింది. వృద్ధుడు అన్న కనికరం మరిచి అందరు చూస్తుండగా దారుణానికి ఒడిగట్టింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? వృద్ధుడితో ఆ మహిళ ఎలా ప్రవర్తించిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అది తమిళనాడు తిరువూర్ పరిధిలోని సెంట్రల్ బస్టాండ్. ఈ బస్టాండ్ లోకి వేదారణ్యానికి చెందిన ప్రియా అనే మహిళ అతిగా మద్యం సేవించి వచ్చింది. అయితే బస్టాండులో ఉన్న ఓ వృద్ధుడు తన వద్ద డబ్బులు దొంగిలించాడని ప్రియా అతనిపై దాడికి పాల్పడింది. ఇకతాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలియక.. ఆ వృద్ధుడిని కింద పడేసి చెప్పులతో దాడి చేసింది. వృద్ధుడు అన్న కనికరం మరిచి అందరూ చూస్తుండగా అతనిపై ఇష్టమొచ్చిన రీతిలో దాడికి పాల్పడింది. అయితే ఆ మహిళ అలా వృద్ధుడిపై దాడి చేస్తుంటే అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆపే ప్రయత్నం చేయకపోగా… తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
అనంతరం ఈ ఘటనపై అక్కడున్న పోలీసులు స్పందించి ఆ మహిళను అదుపులోకి తీసుకుని ఆ వృద్ధుడిని రక్షించారు. అయితే ఆ మహిళ మద్యం మత్తులో ఉన్న కారణంగానే ఇలా చేసిందని పోలీసులు తెలిపారు. ఇక ఆ మహిళ ఆ వృద్ధుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. తాగిన మత్తులో వృద్ధుడు అన్న కనికరం బరితెగించి ప్రవర్తించిన ఆ మహిళ తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.
— Hardin (@hardintessa143) January 12, 2023