ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా సరే.. భర్తను కాకుండ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. కట్ చేస్తే ఈ కథ ఊహించని మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?
ఆమె పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. ఇక దీంతో సరిపెట్టకుండా మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తకు తెలియకుండ ప్రియుడితో సీక్రెట్ గా మీటింగ్ లు, చాటింగ్ లు చేస్తూ బాగానే ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల భార్య చీకటి కాపురం భర్తకు తెలిసింది. దీంతో భార్య ప్రియుడిని దక్కించుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
అది తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆర్కే పేట మండలం చంద్రవిలాసపురం గ్రామం. యువరాజ్, (29) గాయత్రి (25) దంపతులు. ఇద్దరిదీ ఒకే గ్రామం. మేనమామ కూతురినే యువరాజ్ వివాహం చేసుకున్నాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురం చేశారు. ఇక వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అప్పటి వరకు భార్య తీరుపై భర్తకు ఎలాంటి అనుమానం కలగలేదు. ఇదిలా ఉంటే పెళ్లికన్న ముందు గాయత్రి చెన్నైలోని డిప్లామా నర్సింగ్ చదువుతుండగా శ్రీనివాసన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.
వీరి పరిచయం రాను రాను కాస్త బలంగా తయారై చివరికి వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరూ చాలా రోజల పాటు బాగానే ఎంజాయ్ చేశారు. ఇకపోతే కొంత కాలం తర్వాత గాయత్రి తల్లిదండ్రులు మేనబావ అయిన యువరాజ్ తో పెళ్లి చేశారు. తన ప్రియుడి విషయం భర్తకు తెలియకుండా గాయత్రి బాగానే మెయింటెన్స్ చేస్తూ పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన తర్వాత కూడా గాయత్రి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ బయట ప్రియుడు అయిన శ్రీనివాసన్ ను కలుసుకునేది.
ఇక కొన్ని రోజుల తర్వాత భార్యపై ప్రవర్తనపై అనుమానంతో భర్త జాబ్ కు వెళ్లొద్దని భార్యకు సూచించాడు. దీంతో అప్పటి నుంచి గాయత్రి ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండేది. అయితే ఈ క్రమంలోనే ఆ మహిళకు ప్రియుడిని కలుసుకునే వీలు లేకుండ పోయింది. ప్రియుడి మోజులో పడిన గాయత్రికి ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే తన భర్త యువరాజ్ ను చంపడం. ఇదే విషయాన్ని గాయత్రి ప్రియుడు శ్రీనివాసన్ కు చెప్పింది.
ప్రియురాలిని దక్కించుకునేందుకు ప్రియుడు కూడా సరేనన్నాడు. దీంతో గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాస్ తో పాటు మరో వ్యక్తి కలిసి యువరాజ్ ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి మోజులో పడి అటు భర్తను, ఇటు సంతోషాన్ని దూరం చేసుకున్న గాయత్రి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.