అరవింద్ కుమార్ కు కాలేజీలో ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఫిబ్రవరి 14 లవర్స్ డేను అతడు తన ప్రియురాలితో స్పెషల్ గా జరుపుకుని ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ, చేతులు చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో అతడు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే?
వాలెంటైన్స్ డే.. ఈ రోజును ప్రేమికులు చాలా స్పెషల్ గా జరుపుకోవాలనుకుంటారు. ప్రేమించిన వారిపై తమకున్న ప్రేమను తెలియడం కోసం మంచి మంచి గిఫ్ట్ లు కొనిస్తుంటారు. ఇక అచ్చం అలాగే తన ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో.. ఆ యువకుడు ఓ మేకను దొంగిలించాడు. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలేం జరిగిందంటే?
అది తమిళనాడు విల్లుపురం జిల్లా కందాచీపురం పరిధిలోని మలయరసన్ కుప్పం. ఇదే గ్రామంలో అరవింద్ కుమార్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే అరవింద్ కుమార్ కు కాలేజీలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఫిబ్రవరి 14 లవర్స్ డేను అరవింద్ కుమార్ తన ప్రియురాలితో కాస్త స్పెషల్ గా జరుపుకోవాలనుకున్నాడు. ఇక ఎలాగైన తన ప్రియురాలిని ఏదైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ, చేతులు చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మనోడికి ఓ ఐడియా తట్టింది. అదే దొంగతనం చేయడం.
ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ ఇటీవల గ్రామంలోని ఓ మహిళకు చెందిన మేకల మంద నుంచి ఓ మేకను దొంగతనం చేశాడు. అతను దొంగతనం చేసే సమయంలో ఆ మహిళకు మందలోంచి మేకలు అరుస్తున్నట్లుగా శబ్ధం వినిపించింది. ఏం జరిగిందని ఆ మహిళ బయటకు వచ్చి చూడగా.. అరవింద్ కుమార్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై మేకను తీసుకెళ్తున్నాడు. దీనిని పసిగట్టిన ఆ మహిళ.. వెంటనే తన కుటుంబ సభ్యులను పిలిపించి అరవింద్ కుమార్ తో పాటు అతని స్నేహితుడిని పట్టుకున్నారు.
వెంటనే పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి బైక్ ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో అరవింద్ కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటపెట్టాడు. ఫిబ్రవరి 14న తన ప్రియురాలికి ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాను. కానీ, నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. దీని కారణంగానే ఆ మేకను దొంగతనం చేశాడనని అరవింద్ పోలీసులకు తెలిపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.