ఈ రోజుల్లో చాలా మంది యువకులు ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమిస్తున్నామని నమ్మించి ప్రేమించే దాక వెంటపడుతున్నారు. ఇక అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రకాలు ఎంజాయ్ చేస్తూ సినిమాలు, షికారులంటూ తెగ తిరుగుతున్నారు. ఇక చివరికి ప్రియురాలు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియురాలు ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తమిళనాడు తత్తుకూరు పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే వినయ్ (పేర్లు మార్చాం), శాంతి అనే యువకుడు నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరూ స్థానికంగా ఉండే ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇక చదువుకునే రోజుల్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే వినయ్ శాంతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మొదట్లో శాంతి వినయ్ అంగీకరించలేదు. అయినా వినకుండా వినయ్ శాంతి వెంటపడడంతో ఆ యువతి చివరికి అతని ప్రేమకు తలొగ్గింది. దీంతో వినయ్ ఎగిరిగంతేశాడు. అలా ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తేలియాడారు.ఇద్దరూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. అలా కొన్నాళ్ల తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటానని వినయ్ ప్రియురాలిని నమ్మించాడు.
ఇదంతా నిజమేనేనని నమ్మిన శాంతి చివరికి అతడితో శారీరకంగా కూడా కలిసింది. అలా పలుమార్లు శారీరకంగా కలవడంతో శాంతి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే శాంతి పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. ఇది విన్న వినయ్ ఒక్కసారిగా షాక్ కు గురై ప్రియురాలితో పెళ్లికి నిరాకరించాడు. అయినా సరే శాంతి వినయ్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ప్రియురాలి మాటలు వినకుండా వినయ్.. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ ప్రియురాలికి కరాఖండిగా చెప్పాడు. ప్రియుడి మాటలు విన్న శాంతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే శాంతి ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో శాంతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన శాంతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శాంతి ప్రస్తుతం 3 నెలల గర్భవతి కావడం విశేషం. ఇక శాంతికి ఆత్మహత్యకు కారణమైన వినయ్ ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.