వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని సాగించారు. కొంత కాలానికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన భర్త డాక్టర్ గా పని చేస్తుండగా, భార్య మరిన్ని ఉన్నత చదువుల కోసం మరో రాష్ట్రానికి వెళ్లింది. దీంతో భర్త తన కుమారుడితో పాటు తమిళనాడులో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేవాడు. కట్ చేస్తే భర్త ఓవర్ డోస్ ఇంజక్షన్ తీసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడులోని సంపత్ నగర్ ప్రాంతం. ఇక్కడే శక్తివేల్, పూర్ణిమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఇకపోతే భర్త శక్తివేల్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇక భార్య మాత్రం మరిన్ని ఉన్నత చదువుల కోసం ఇటీవల అహ్మదాబాద్ కు వెళ్లింది. దీంతో భర్త శక్తివేల్ తన కుమారుడిని చూసుకుంటూ సంపత్ నగర్ లోనే ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. తాజాగా శక్తివేల్ తన ఇంట్లో ఓవర్ డోస్ ఇంజక్షన్ తీసుకుని ఇంట్లో అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు.
రోజు గడిచినా ఇంట్లో నుంచి శక్తివేల్ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇక అతని ఇంట్లోకి వెళ్లి చూడగా అపస్మారకస్థితిలో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. తండ్రి మరణించాడని తెలుసుకున్న కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.