యువరాజ్ (35), పాన్ విళి (30) దంపతులు. తమిళనాడులోని సేలంకు చెందిన ఈ భార్యాభర్తలకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి వీరికి నితీషా (7), అక్షర (5) కూతుళ్లు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటు ఈ దంపతులు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా ఎంతో అనందంగా సాగుతున్న సంసారంలో మూడేళ్ల కిందట పెద్ద కూతురు నితీషా షుగర్ బారిన పడింది. దీంతో తల్లిదండ్రులు కుమార్తెకు అనేక ఆస్పత్రుల్లో చూపించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగానే చిన్న కూతురు అయిన అక్షరకు కూడా గత మూడు రోజుల కిందట షుగర్ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ , పాన్ విళి దంపతులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పెద్ద కూతురు నితీషాకు వచ్చిన వ్యాధితో సతమతమవుతుంటే, చిన్న కూతురు కూడా షుగర్ వ్యాది బారిన పడడంతో తట్టుకోలేకపోయారు. ఇంత చిన్న వయసులో కూతుళ్లు పడుతున్నబాధను చూసి ఆ దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆ దంపతులకు ఏం చేయాలో అస్సలు తోచలేదు. ఈ సమయంలోనే ఆ దంపతులకు ఓ ఆలోచన వచ్చింది.
అదే.. ఆత్మహత్య. ఇదొక్కటే మాకు మార్గమని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. ఇటీవల ఆ దంపతులు ఇద్దరు కూతుళ్లను తీసుకుని తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని పాలారు నది వద్దకు చేరుకున్నారు. ఇక ఎవరు లేని సమయంలో ఆ దంపతులతో పాటు ఇద్దరు కూతుళ్లు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో మంగళవారం నలుగురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అందమైన కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకోవంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.