తరాలు మారుతున్న కొద్ది మనుషులు ప్రవర్తనలో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ఎంతో పవిత్రమైన వివాహ బంధానికి కొందరు వ్యక్తులు తూట్లు పొడుస్తూ వివాహ వ్యవస్థకు ఉన్న విలువను తీసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే అక్రమ సంబంధం వైపు అడుగులు వేసిన ఓ వివాహిత కట్టుకున్నవాడిని కాదని ప్రియుడితో వెళ్లి చివరికి ఎటూ కాకుండా పోయి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఎరుమైవెట్టిపాళ్యం. ఇదే గ్రామానికి చెందిన బాబు, ఆముద భార్యాభర్తలు. వీరికి పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అప్పటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగుతూ ఉంది. ఇక వీరి సంసారం సవ్యంగా సాగుతుందని అనుకునే క్రమంలోనే భార్య పరాయి మగాళ్ల కోసం ఆరాటపడింది. ఇక ఇంతటితో ఆగకుండా స్థానికంగా ఉండే జగదీశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది.
ఇక ప్రియుడి మైకంలోకి వెళ్లిపోయిన ఆముదకు భర్త కన్న ప్రియుడే ఎక్కువయ్యాడు. తాళికట్టిన భర్తతో ఉండడం ఇష్టం లేని ఆముద జగదీశ్వర్ తో వెళ్లాలనుకుంది. ఇందులో భాగంగానే కొన్నాళ్ల కిందట భర్తను కాదని ప్రియుడితో కలిసి పాండిచ్చేరి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత ఆముద తల్లిదండ్రులు కలగజేసుకుని వెతికిపట్టుకొచ్చి భర్తకు అప్పగించారు. ఇక నుంచైన బుద్దిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికీ కూడా ఆమెకు ప్రియుడే కావాలనుకుంది. దీంతో మరోసారి ఆముద ప్రియుడితో వెళ్లిపోయింది.
ఆముద కోసం కుటుంబ సభ్యులు అక్కడ, ఇక్కడ వెతుకుతున్నారు. 20 రోజులు గడిచింది. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రాంతంలో కుళ్లిన మహిళ శవం కనిపించింది. గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డెబ్ బాడీని పోలీసులు పరిశీలించి విచారించగా చివరికి ఆ శవం ఆముదగా గుర్తించారు.అనంతరం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.