శోభనం.. ఆ రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కొత్తగా పెళ్లైన భార్యాభర్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి ఫస్ట్ నైట్ కోసం కుటుంబ సభ్యులే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే ఎన్నో ఆశలతో బెడ్ రూంలోకి పాల గ్లాసుతో సిగ్గుతో తలదించుకుని వెళ్లిన ఓ నవ వధువుకి వరుడు ఊహించని ఝలక్ ఇచ్చాడు. దీంతో వరుడు చేసిన పనికి వధువు ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. అసలు వరుడు ఇచ్చిన ఝలక్ ఏంటి? ఆస్పత్రికి వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కూతనల్లూరుకు చెందిన నళిని (29) తోసుత్తూరుకు చెందిన రాజ్ కుమార్ (37)తో ఇరువురి తల్లిదండ్రులు ఇటీవల వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు మధ్య వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి మరుసటి రోజు బంధువులంతా నూతన దంపతులకు శోభనాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం నవ వధువు ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాత్రి 10 దాటింది. బంధువులంతా వధువు చేతికి పాల గ్లాసు అందించారు. సిగ్గుపడుతూ ఆ వధువు తలదించుకుని మరీ బెడ్ రూంలోకి అడుగులు వేసింది. వరుడు తలుపు గడియా పెట్టి వధువు వద్దకు వచ్చాడు. ఆమెపై చేయి వేసే సరికి వధువు ఏదో తెలియని మత్తులోకి జారుకుంది.
ఇక 30 నిమిషాలు కాగానే శోభనం గది నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఈ అరుపులను విన్న బంధువులు మాములే కదా అని.. విని విననట్లుగా వదిలేశారు. మరికొద్దిసేపు కాగానే ఆ అరుపులు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఇక్కడే బంధువులకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు తియ్యాలని వరుడికి చెప్పారు. ఎంతకు తీయకపోవడంతో బంధువులు బద్దలు కొట్టి చూడగా ఊహించిన షాక్ తిన్నారు. నూతన వధువు నగ్నం కనిపిస్తూ ఒళ్లంతా గాయాలతో కనిపించి స్ప్రుహ లేకుండా కనిపించింది. ఇక కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన ఓ గంట తర్వాత వధువు కళ్లు తెరిచి చూసింది. బెడ్ రూంలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
నళిని ఏడుస్తూ.. రాజ్ కుమార్ అసలు మగాడే కాదని, అతనో హిజ్రా అంటూ పెదవి విప్పింది. ఇది విన్న అందరూ ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఇంతటితో ఆగకుండా అతను నాతో అసహజ శృంగారం చేయాలని వేధించాడని, వినకపోతే ఇలా దారుణంగా కొట్టాడని వధువు వాపోయింది. కూతురు మాటలు విన్న నళిని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు వరుడు రాజ్ కుమార్ ను విచారించగా.. నళిని అసహజ శృంగారం చేయాలని కోరుకుందని, దీంతో నాకు కోపం వచ్చి ఇలా కొట్టానంటూ ఆరోపించాడు. ఇరువురి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.