బాగా చదువుకుని నలుగురిలో తలఎత్తుకుని బతకాలనుకుంది. ఎన్నో కోరికలతో పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి.. తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకు రావాలనుకుంది. ఇందులో భాగంగానే నర్సింగ్ ద్వితియ సంవ్సతరం చదువుతో చదువుల్లో సరస్వతిగా రాణిస్తుంది. ఆమె ప్రతిభను చూసి అంతా మెచ్చుకునేవారు. అలా ఎన్నో ఆశలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడి ప్రాణాలు విడిచింది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ యువతి మరణానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు సమీపంలోని మాదిరవేడులో మహిళా నర్సింగ్ కళాశాలలో ఈరోడ్‌కు చెందిన సుమతి(19) నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే దానికి అనుబంధంగా ఉన్న హస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్లేది. ఎప్పటిలాగే రోజూ కాలేజీకి వెళ్లడం, మళ్లీ హాస్టల్ కు రావడం చేసేది. ఇందులో భాగంగానే శనివారం సుమతి ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం సమయంలో లంచ్ కోసం హాస్టల్ కు వచ్చింది. కాగా అందరూ డైనింగ్ హాల్ వద్దకు వెళ్తే.. సుమతి మాత్రం తినకుండా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఇక గంటసేపు అయిన సుమతి బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చి.. తోటి ఫ్రెండ్స్ తలుపు కొట్టి చూశారు. ఎంతకు కూడా ఓపెన్ కాలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సుమతి ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ ను చూసిన తోటి ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారాన్ని తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది సుమతి తల్లిదండ్రులకు చెప్పారు. ఇక హుటాహుటిన సుమతి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని విగత జీవిగా పడిఉన్నకూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల వేధింపుల కారణంగా మా కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, అనంతరం సీబీసీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక పోలీసుల విచారణలో మాత్రం సుమతి ఓ యువకుడితో సన్నిహితంగా మెలిగిందని, ఈ విషయంతోనే తల్లిదండ్రులతో గొడవ కూడా పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆదివారం హాస్టల్ కళాశాల సిబ్బంది, సహచర విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారు. తల్లిదండ్రులతో గొడవ పడిన కొన్ని రోజుల్లోనే యువతి ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే కల్లకురిచ్చి, కీళచ్చేరి హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఘటనలు మరువక ముందే సుమతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సుమతి ఆత్మహత్య చేసుకున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.