నేటి కాలంలో కొందరు భార్యాభర్తలు పవిత్రమైన వివాహబంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బరితెగిస్తూ అక్రమ సంబంధాల వేటలో పడి పచ్చటి కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే భార్యను కాదని ఓ భర్త పరాయి మహిళపై మోజుపడ్డాడు. తీరా ఈ విషయం తన భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంత మోసం చేస్తావా అంటూ భర్తపై కోపంతో రగిలిపోయింది. ఇక భర్తకు ఊహించని షాకిచ్చిన భార్య చివరికి కోలుకోలేని దెబ్బకొట్టి ఆస్పత్రికి పాలు చేసింది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని రాణిపేట జిల్లా కావేరి పాకం. ఇదే గ్రామానికి చెందిన తుంగరాజ్, ప్రియా భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి పిల్లలు కూడా జన్మించారు. భార్యాభర్తలు సంతోషమైన జీవితాన్ని గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్ల నుంచి భర్త తన బుద్దిని వక్రమార్గంలోకి మళ్లించి పరాయి సుఖం కోసం పాకులాడాడు. ఈ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి.., చివరికి తన భార్య చెవిన పడింది. కోపంతో ఊగిపోయిన భార్య తీవ్ర మనోవేదనకు గురైంది. ఏం చేయాలో తెలియక నన్ను ఇంత మోసం చేస్తావా? అంటూ ఏడుస్తూ భర్తపై కోపంతో రగిలిపోయింది.
భర్త తీరును సహించలేకపోయిన భార్య మరిగే నీటిని తీసుకుని భర్త మర్మంగంపై పోసింది. ఈ దాడిలో భర్త సగానికిపైగా గాయాలపాలయ్యాడు. లబోదిబో మంటు భర్త ఏడుస్తుంటే కనికరించిన భార్య ఆస్పత్రికి తరలించింది. అనంతరం చేసిన తప్పును ఒప్పుకున్న భార్య పోలీసుల ఎదుట లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భర్త తీరు నచ్చక భార్య చేసిన పని సరైనదేనని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.