అది తమిళనాడులోని పెరంబలూరు సమీపంలోని ఓ ప్రాంతం. ఆరో తరగతి నుంచి ఇద్దరు అమ్మాయిలు ఒకే దగ్గర కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమించుకునేదాక వెళ్లింది. వీరిద్దరిలో ఒక బాలిక మాగాళ్లలా చెప్పులు వేసుకోవడం, క్రాఫ్ చేయించుకోవడం చేస్తూ ఉండేది. అయితే ఈ బాలిక లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకుని మగవారిలా మారేందుకు సిద్దపడింది. ఇలా చికత్స చేసుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చనే ఆలోచనకు వచ్చారు. ఇక అనుకున్నట్లుగానే కాలేజీకి వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన వాళ్లిద్దరూ వైద్య పరీక్షల కోసమని చెన్నైకి వెళ్లిపోయారు.
ఇది కూాడా చదవండి: పిల్లల ముందే తల్లి ప్రియుడితో సరసాలు.. అంతటితో ఆగక!
దీంతో అర్ధాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. ఎంతకు వారి జాడ కనిపించలేదు. ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తు కొనసాగించిన పోలీసులకు చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకుని ముంబైకి చెక్కేద్దామని అనుకుంటున్న తరుణంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి చైల్డ్ లైన్ ద్వారా కౌన్స్ లింగ్ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.