ప్రియుడి మైకంలో పడి కొందరు తల్లిదండ్రులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్నవాడిని కాదని కొందరు భార్యలు పరువును బజారును పడేస్తూ హత్యలకు కూడా వెనకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కన్న తల్లి పిల్లలకు తినే ఆహారంలో విషం కలిపి చంపాలని చూసింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలో మార్తాండంలో జగదీశ్ – కార్తీక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కొంత కాలం సాఫీగానే సాగిన వీరి కాపురంలో కొన్నాళ్లకి భార్య పక్క చూపులు చూసింది. ఇదే కాకుండా కార్తీక సొంత బంధువులతోనే వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుంది. అయితే ఇటీవల కార్తీక భర్తలేని సమయం చూసి సునీల్ అనే వ్యక్తితో ఇంట్లోనే పిల్లలు చూస్తుండగా సరసాలకు దిగింది.
ఇది కూడా చదవండి: ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.. చివరకు అన్నాచెళ్లెల్లు అని తెలియడంతో!
పిల్లలు ఓ కంట కనిపెట్టే సరికి వారిని లేకుండా చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే ఓ రోజు వారు తినే ఆహారంలో విషం కలిపింది. తీవ్ర అస్వస్థకు గురైన పిల్లలను ఏం తెలియనట్టు ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనలో కుమారుడు మరణించగా, కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.