మహిళలపై లైంగిక అకృత్యాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి తప్పా తగ్గడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళతో పాటు రెండేళ్ల బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూరు వలసు ప్రాంతం. శివకుమార్, అంజలి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. అయితే శివకుమార్ కు పెళ్లికానటువంటి అన్నకూడా ఉన్నాడు.
నిత్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి శివకుమార్ అన్న తన సొంత తమ్ముడి భార్య అయిన అంజలిపై కామ కోరికలు పెంచుకున్నాడు. అవి రోజు రోజుకు అతనిలో మితిమీరుతూ కామందుడిలా మారాడు. దీంతో ఓ రోజు తన మరదలిని తన కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. కానీ మరదలు మాత్రం తలొగ్గలేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు. ఏం చేయాలో తెలియక తన చేతిలో ఉన్న గొడ్డలితో అంజలితో పాటు ఆమె కూతురైన రెండేళ్ల బాలికను దారుణంగా హత్య చేసి ఊరి చివర అడవిలో బతికుండానే కాల్చేశాడు.
ఇది కూడా చదవండి: టీచర్‌పై వ్యామోహం.. బాత్ రూమ్‌లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
దీంతో భార్య జాడ కనిపించకపోవడంతో శివకుమార్ ఊరంత వెతికాడు. చివరికి అడవిలో కాలుతున్న ఇద్దరి శరీరాలను చూసి అంజలి ఆమె కూతురుదేనని గ్రామస్తులు గుర్తించారు. వీరి మరణవార్త విన్న శివకుమార్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన శివకుమార్ అన్నను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.