ఇద్దరు దుండగులు బరితెగించి ప్రవర్తించారు. అభం, శుభం తెలియని ఓ ఇంటర్ బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
సమాజంలో కొందరు మనుషులు దుర్మార్గుల్లా రెచ్చిపోతున్నారు. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, అత్యాచారాలు. ఇవే నేటి సమాజంలో ఎక్కువగా జరుగుతున్న దారుణాలు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఇద్దరు దుర్మార్గులు ఇంటర్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని పెరంబులూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలిక (16) నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంటర్ చదువుతోంది. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతానికి చెందిన స్టీఫెన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఎప్పటి నుంచో ఆ బాలికపై ఈ దుర్మార్గుడు కన్నేశాడు. ఎలాగైన ఆ బాలికతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అయితే 8 నెలల క్రితం స్టీఫెన్ ఆ బాలికపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక తరుచు బాధపడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఇదే విషయాన్ని ఆ బాలిక తన తండ్రికి వివరించింది.
ఇది ఎవరికి చెప్పొద్దని బెదిరించి ఆ బాలికను అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించాడు. కొన్నాళ్ల నుంచి అక్కడే ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆ బాలికపై తన మేనమామ కొడుకు కన్నేశాడు. దీంతో ఈ నెల 8న ఆ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం బయటపడడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పందం మేరకు ఆ యువకుడితో ఆ బాలికకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆ బాలికకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆ అమ్మాయి బాలికల సంక్షేమ అధికారికి జరిగిన విషయాన్ని వివరించింది.
స్పందించిన అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు స్టీఫెన్, మేనమామ కొడుకుని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.