ప్రభుత్వ ఉద్యోగం ఆమె కల. దాని కోసం వచ్చిన ప్రతీ నోటిఫికేషన్ కు దరఖాస్తూ చేస్తూ ఎన్నో ఏళ్లుగా పుస్తకాలతో కుస్తి పట్టింది. కానీ, చివరికి ఆమె కలలు కన్న గవర్నమెంట్ జాబ్ మాత్రం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆమె కల. దాని కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది. ఇందులో భాగంగానే బీఎస్సీ పూర్తి చేసింది. అంతేకాకుండా వచ్చిన అన్ని నోటిఫికేషన్ లకు దరఖాస్తూ చేస్తూ ఎన్నో ఏళ్లుగా పుస్తకాలతో కుస్తి పడుతూనే ఉంది. పెళ్లై పిల్లలున్నారని ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ముందడుగు వేసింది. సంసారంలో కలహాలు, పిల్లల అల్లరి ఎన్ని ఉన్నా అలాగే చదివింది. కానీ, ఇంత కష్టపడ్డా ఆమె కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం మాత్రం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఊహించని డెసిషన్ తీసుకుని అందరికీ షాకిచ్చింది. అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు క్రిష్ణగిరి కల్లావి పరిధిలోని కోళినాయకనపట్టి గ్రామం. ఇక్కడే గుణశేఖర్ (40)-దైవ (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అయితే బీఎస్సీ పూర్తి చేసిన దైవకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక ఉంది. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా అన్ని పోటీ పరీక్షలకు కష్టపడి చదువుతూ వచ్చింది. ఇటీవల మరో పరీక్ష కూడా రాసింది. కానీ, అందులో ఆమె అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే నాతోటి స్నేహితులు అంతా ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడ్డారు. నేను మాత్రం ఇంట్లోనే ఉన్నానంటూ తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఇందుకు తోడు ఆమె మామ సైతం ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కాలేదని సూటి పోటి మాటలతో వేధించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇవన్నీ తట్టుకోలేకపోయిన ఆ మహిళ జీవితంపై విరక్తి చెంది సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో పిల్లలకు పురుగుల మందు కలిపిన ఆహారం తినిపించింది. అది తిన్న ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారు. అనంతరం దైవ ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక సాయంత్రం భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, పిల్లలు చనిపోయి ఉన్నారు. ఈ సీన్ చూసిన అతడు ఒక్కసారిగా షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం, మృతురాలిని మామ తిట్టడం కారణంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రభుత్వ ఉద్యగం రాలేదని, మామ తిట్టాడని పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న మృతురాలి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.