ఆ యువతికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. సంసారం నిలబడకపోవడంతో అతనితో విడిపోయి మరో వివాహం చేసుకుంది. అతనితో కూడా సంతోషంగా ఉండలేకపోయింది. దీంతో రెండో భర్తకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ యువతిపై మాజీ ప్రియుడు కన్నేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆమెకు గతంలో పెళ్లై జరిగింది. కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. అయితే భార్యాభర్తల మనస్పర్థల కారణంగా ఆ వివాహిత భర్తకు దూరంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె మాజీ ప్రియుడు ఆ యువతిపై కన్నేసి లొంగదీసుకున్నాడు. అంతేకాకుండా తరుచు వేధింపులకు పాల్పడుతూ నరకం చూపించాడు. ఇతడి వేధింపులను భరించలేని ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుని అతడికి కోలుకోలేని షాకిచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు కోయంబత్తూరు ఒలింపసర్ పరిధిలోని రామస్వామి నగర్. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువతి (20)కి గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, ఉన్నట్టుండి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా బాగానే కొన్ని రోజులు సంసారం చేసింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ యువతి రెండో భర్తతో కూడా విడిపోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. ఈ క్రమంలోనే ఆ యువతి మాజీ ప్రియుడైన శరవన్ ఆ యువతిపై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే మొదట్లో ప్రేమను ఒలకబోస్తూ ఆ యువతిపై నకిలీ ప్రేమను చూపించాడు. ఇది నిజమేనని నమ్మిన ఆ యువతి.. తన మాజీ ప్రియుడు శరవన్ తో మాట్లాడింది. రాను రాను శరవన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. నాతో ఉండాలని, ప్రేమించాలంటూ ఆ యువతిని వేధించేవాడు. దీంతో ఆ యువతికి ఇదంతా నచ్చక అతడిని పక్కకు పెట్టింది. ఇది శరవన్ కు అస్సలు నచ్చలేదు. నన్ను ప్రేమించకపోతే చంపేస్తానంటూ శరవన్ ఆ యువతికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇతడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ యువతి.. ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మాజీ ప్రియురాలిని లొంగదీసుకుని ఏదో చేయాలని చూసిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.