తమిళనాడులో ఊహించని ఘోరం వెలుగు చూసింది. వృద్ధ దంపతులకు వారి మనవడు విషమిచ్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు వృద్ధ దంపతులను నమ్మించి శీతలపానియంలో విషం కలిపి బలవంతంగా తాగించాడు. అది తాగి ఆ వృద్ద దంపతులు మృత్యువాతపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు విల్లుపురం పరిధిలోని పిల్లూరు గ్రామం. ఇక్కడే కలవు ఆరుముగం- కలవు మణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు అరుళ్ శక్తి అనే మనవడు ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అరుళ్ శక్తి తన అమ్మమ్మ, తాతలను హత్య చేయాలని అనుకున్నాడు.
ఇక పథకం ప్రకారమే ఆ యువకుడు ఇటీవల ఓ రోజు రాత్రి 8:30 నిమిషాలకు ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లాడు. అనంతరం విషం కలిపిన కూల్ డ్రింక్స్ వారికి ఇచ్చి బలవంతంగా తాగించాడు. ఇది తాగిన ఆ వృద్ధ దంపతులు రాత్రి 9:30 నిమిషాలకు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. వీరిని చూసిన ఈ వృద్ధ దంపతుల కుమారుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ వృద్ధ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారించగా వారిని హత్య చేసింది వారి మనవడు అరుళ్ శక్తిగా తేలింది. దీంతో పోలీసులు నిందితుడు అరుళ్ శక్తి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.