ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఎస్ఐ కూడా బలవనర్మరణాలకు పాల్పడ్డారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న సమస్యకు కూడా ఆత్మహత్యే పరిష్కారం అనుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ విఫలమైందని, చదువులో రాణించలేకపోతున్నానని, తల్లిదండ్రులు మందలించారనే కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ ఎస్ఐ ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
అది తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్ రోడ్డు ప్రాంతం. ఇక్కడే తనిగవేలు-గీత దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. తనిగవేలు స్థానికంగా ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలా అతని జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి తనిగవేలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే తనిగవేలు ఎప్పటిలాగే శుక్రవారం కూడా విధులకు హాజరై శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. తన భార్యా పిల్లలతో పాటు కలిసి తిని పడుకున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయం భార్య నిద్రలేచింది.
8 గంటలు అయినా భర్త తనిగవేలు గదిలోంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య గీత.. రూమ్ లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సీన్ చూసి ఆ మహిళ ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనిగవేలు అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.