తమిళనాడులో ఓ ప్రిన్సిపాల్ క్లాసులో విద్యార్థుల ముందే ఓ టీచర్ పై దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు బాధ్యత గల వృత్తిలో ఉంటూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ కోవాలో పోలీసులు, టీచర్లు ఎక్కువగా ఉంటున్నారు. కొందరు పోలీసులు డ్యూటీలో ఉండగానే మద్యం సేవిస్తూ పరువు తీస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఉపాధ్యాయులు మాత్రం క్లాసులో ఉన్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. ఇకపోతే తాజాగా తమిళనాడులో ఓ ప్రిన్సిపాల్ క్లాసులో విద్యార్థుల ముందే ఓ టీచర్ పై దారుణానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే? తమిళనాడు తేని సుబ్బన్ స్ట్రీట్ లో ఉన్న మహారాజా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే ఆ టీచర్ ఇటీవల క్లాసులో పిల్లలకు పాఠాలు చెబుతున్న క్రమంలో సడెన్ గా స్కూల్ ప్రిన్సిపాల్ అన్బ జగన్ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే టీచర్ పై ఆ ప్రిన్సిపాల్ దాడి చేశాడు. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అనంతరం బాధితుడు ప్రిన్సిపాల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ జగన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రిన్సిపాల్ ఆ టీచర్ ను ఎందుకు కొట్టాడన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) April 12, 2023