మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుంది.. ఎవరూ ఊహించలేం. సాధారణంగా బాణా సంచా ఫ్యాక్టరీలో చిన్న పొరపాటు జరిగినా ఫలితం దారుణంగా ఉంటాయి. బాణా సంచ ఫ్యాక్టీరల్లో పేలుళ్లు సంబవించి ఎంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. ఎక్కువగా శివకాశి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి.
మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. దేశ వ్యాప్తంగా అందరూ ఉగాది పండుగ సంతోషంగా జరుపుకుంటుంటే.. అక్కడ మాత్రం విషాదం నెలకొంది. తమిళనాడు చెన్నైకి సమీపంలో ఉన్న కాంచీపురం జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడో వన్ డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్టేడియానికి 70 కిలోమీటర్ల దూరంలోని కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు అక్కడే సజీవ సమాధి అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధానికి చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంటర్ నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలా భారీ పేలుడు సంభవించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
తమిళనాడు.. చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం జిల్లాలో కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టీరలో 30 పని చేస్తున్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
A #firecracker unit in #TamilNadu‘s Kanchipuram engulfed in flames
By @Shilpa1308https://t.co/tDOV9AiHMy
— IndiaToday (@IndiaToday) March 22, 2023