Crime News: ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియని వయసులో కొంతమంది బాలబాలికలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాలను నాశనం చేసుకునే పనులు చేస్తున్నారు. తాజాగా, తమిళనాడులో చోటుచేసుకున్న ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఓ టెన్త్ క్లాస్ విద్యార్థి, ఇంటర్ విద్యార్థినిని తల్లిని చేశాడు. సదరు బాలిక కాలేజ్ వాష్ రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు.. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన ఓ బాలిక ప్రభుత్వ కాలేజలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలికకు ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తరచుగా ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారు. ఈ నేపథ్యంలోనే బాలిక గర్భం దాల్చింది. ఎనిమిది నెలలు గడిచాయి. కొద్దిరోజుల క్రితం బాలిక క్లాస్ రూమ్‌లో ఉండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే బాలిక వాష్ రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, కాన్పు సరిగా అవ్వకపోవటం వల్ల బిడ్డ చనిపోయింది. దీంతో బాలిక బొడ్డు తీగను తానే స్వయంగా కోసింది. తర్వాత బిడ్డను పక్కనే ఉన్న పొదల్లో పడేసింది. పొదల్లో చనిపోయిన బిడ్డను గమనించిన కొందరు విద్యార్థులు స్కూలు యజమాన్యానికి సమాచారం ఇచ్చారు.
స్కూలు యజమాన్యం పోలీసులను పిలిపించింది. అక్కడికి వచ్చిన పోలీసులు మృత శిశువును స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎవరు బిడ్డకు జన్మనిచ్చారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. సదరు బాధిత విద్యార్థినిని గుర్తించారు. విద్యార్థిని జరిగిందంతా పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మైనర్ కావటంతో జువైనల్ హోంకు తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. కుల పెద్దల తీర్పుతో చివరికి!