CRIME NEWS : కొంతమంది క్షణికావేశంలో నేరాలు చేస్తారు.. తర్వాత దొరకకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. మరికొంత మంది పక్కా ప్లాన్‌తో నేరాలు చేస్తారు.. దొరకములే అనుకుంటారు. కానీ, ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేసి అడ్డంగా దొరికి పోతారు. నేరాలు చేయటంలోనూ.. వాటినుంచి తప్పించుకోవటంలోనూ ప్రదర్శించే నైపుణ్యం.. నేరాలు చేయకుండా ఉండేందుకు చూపించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు. హత్య చేసిన గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన రాజా(38), కన్నమ్మ(40) గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
కన్నమ్మ కుంద్రతుర్, సేకిజార్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. శనివారం రాజా, కన్నమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెను లైంగికంగా వాడుకోవటానికి ప్రయత్నించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. కొద్ది సేపటి తర్వాత ఇంట్లోనుంచి మహిళ అరుపులు వినిపించటంతో పొరిగింటి వాళ్లు అక్కడికి వచ్చారు. అతడికి సర్థిచెప్పి పంపించేశారు. అయితే, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాజా మళ్లీ అక్కడికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి గడియపెట్టేశాడు. అనంతరం కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు.
హత్య చేసిన తర్వాత 1 గంట సమయంలో తన ఇంటికి వెళ్లిపోవటానికి బస్టాప్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో పాట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు రాజా టీషర్ట్‌పై రక్తపు మరకలు ఉండటం గమనించారు. అతడ్ని ప్రశ్నించారు. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కన్నమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అర్థనగ్నంగా రక్తపు మడుగులో గాయాలతో పడి ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం తరలించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఎదురింటి యువకుడితో భార్య సంబంధం.. ఇంటికొచ్చి గొడవ చేయటంతో
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.