క్షణకాల సుఖాల కోసం పచ్చని కాపురాలను, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాక.. బిడ్డల జీవితాలను సైతం నాశనం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ప్రేమ, అనుబంధం, ఆప్యాయత.. మనుషుల్లో ఇవన్ని క్రమక్రమంగా దూరమవుతున్నాయా ఏంటో అర్థం కాకుండా ఉన్నాయి కొన్ని సంఘటనలు చూస్తే.. బంధాలు నిలబడటానికి కావాల్సిన బలమైన పునాది నమ్మకం. కానీ నేటి కాలం బంధాల్లో ఇవి లోపిస్తున్నాయి. క్షణకాల సుఖం కోసం తమని ప్రాణంగా ప్రేమించిన భాగస్వామిని, తల్లిదండ్రులు తప్ప మరో ప్రపంచం తెలియని బిడ్డల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. తమ సుఖం చూసుకుని.. అభం శుభం తెలియని బిడ్డల జీవితాలను ఆగం చేస్తున్నారు. ఇక నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక తాజాగా తమిళనాడులో ఈ కోవకు చెందిన దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
ప్రేమ వివాహం చేసుకున్న మహిళ.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తని వద్దని ఎంత వారించినా వినలేదు. చెప్పి చెప్పి విసిగిపోయిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఈ దారుణం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పుదుక్కోట్టై జిల్లా పొన్నమరావతి సమీపంలోని అరసమలైకి చెందిన వి గణేశన్ ప్రస్తుతం సూలూరు సమీపంలోని పల్లపాలెంలో భార్యాబిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గణేశ్‌ది ప్రేమ వివాహం. భార్య పేరు నివేత. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.
నివేత.. తన ఇంటికి సమీపంలోని టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో నివేత అక్కడ తన సహోద్యోగిగా ఉన్న మురుగన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గణేశన్.. దీని గురించి నివేతను హెచ్చరించాడు. ఆమె ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. కానీ నివేత మాత్రం.. గణేశన్ మాటలు పట్టించుకోకుండా.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా బుధవారం మధ్యాహ్నం వివాహేతర సంబంధం గురించి గణేశన్-నివేతల మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో వంటగదిలోకి వెళ్లిన గణేశన్.. కత్తి తెచ్చి.. నివేత మెడపై రెండుసార్లు పొడిచాడు. దాంతో నివేత అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ దారుణం గురించి ఇరుగుపొరుగు వారు సూలూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నివేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సింగనల్లూరు సమీపంలోని వరదరాజపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఇఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నివేత తల్లి సరోజ సూలూరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గణేశన్‌పై హత్య కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.